Header Banner

కళ్లు చెదిరే ఫీచర్లతో షావోమీ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. అతి ధరకే! ఈ ఛాన్స్ అస్సలు మిస్..

  Thu Mar 06, 2025 08:30        Gadgets

ఇండియాలో Poco M7 5G హ్యాండ్‌సెట్ లాంఛ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెస‌ర్‌, దుమ్ము- స్ప్లాష్ నియంత్ర‌ణ‌కు IP52-రేటెడ్ బిల్డ్, 5,160mAh బ్యాటరీ సామ‌ర్థ్యంతో వ‌స్తోంది. దీనికి 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను అందించారు. అలాగే, ఈ ఫోన్ సెగ్మెంట్‌లో అతిపెద్ద డిస్‌ప్లేతో వస్తుందని, ట్రిపుల్ TÜV రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉందని కంపెనీ వెల్ల‌డించింది. ఇది గ‌త ఏడాది డిసెంబర్‌లో మ‌న దేశంలో విడుద‌లైన‌ Poco M7 Pro 5G ఫోన్‌ వేరియంట్‌లో చేరింది. Poco M7 5G ఫోన్ భార‌త్‌లో 6GB + 128GB ఆప్షన్ ధర రూ. 9,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే, 8GB వేరియంట్ ధర రూ. 10,999గా ఉంది. ఈ ధరలు మొదటి రోజు సేల్‌కు మాత్రమే వర్తిస్తాయి. Poco M7 5G మార్చి 7 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ మింట్ గ్రీన్, ఓషన్ బ్లూ, శాటిన్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో ల‌భిస్తుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. కొత్త Poco M7 5G హ్యాండ్‌సెట్‌ 6.88-అంగుళాల HD+ (720 x 1,640 పిక్సెల్స్) డిస్‌ప్లేతో వ‌స్తుంది. అలాగే, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 600 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ లెవల్, TÜV రీన్‌ల్యాండ్ లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ, సిర్కాడియన్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఇది 8GB వరకు RAM, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అటాచ్ చేయబడిన ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెస‌ర్‌ ద్వారా శక్తిని గ్ర‌హిస్తుంది. అలాగే, ఈ ఫోన్ Android 14-ఆధారిత HyperOS తో వస్తోంది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #PocoM75GLowCost #PocoM75GPriceinIndia #PocoM75G #Indialaunch #POCOM75Gspecifications #PocoM7-5Gseries #Poco